30 March, 2026 | 2:33 AM

రెండేళ్లలో ఎస్‌ఎల్బీసీ, డిండి పూర్తి

30-03-2026 12:17 AM
  1. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేదు

మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాం తి): ఎస్‌ఎల్బీసీని 2028 జూన్ చివరికల్లా పూర్తి చేస్తామని, రెండేళ్లలో డిండి ప్రాజెక్టును కూడా నిర్మిస్తామని నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సుస్పష్టం చేశా రు. ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాలికాబద్ధంగా ముందుకు పోతోందని ఆయన తెలిపారు. ఆదివారం రాష్ట్ర శాసనసభలో నీటిపారుదలశాఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమన్నారు.

2025 జరిగిన ఘటన అనంతరం ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అత్యధునాతన సాంకేతిక పద్ధతులతో అంతర్జాతీయ ప్రమాణాల కనుగుణంగా పు నరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో నీటిపారుదల రంగంమీద 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఫలితం సాధించలేక పోయారని విమర్శించా రు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంలో జా ప్యం జరగడానికి గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతోటే అని తెలంగాణ ప్రజలు ఈ గణాంకాలను గుర్తించాలని ఆయన కోరారు. కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

పెండింగ్‌లో ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, అందుకు అ వసరమైన భూసేకరణ కోసం ప్రభుత్వం 5,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని మంజూరు చేసిందని వివరించారు. జూన్, 2026 నాటి కి ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకానికి 18,000 కోట్లు మంజూరు చేసి, టెండర్ల ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు.

స్వతంత్ర భారతదేశ చరిత్రలో సన్న బియ్యం పంపిణీ  విప్లవాత్మక మార్పని అభివర్ణించారు. పశ్చిమాసియా పరిస్థితుల వల్ల గ్యాస్ ప్రభావంపై ఆయన స్పందిస్తూ గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేదని, వాణిజ్యపరంగా గ్యాస్ కొరత ఉందన్నారు.