22-08-2025 01:25:37 AM
మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి
మేడ్చల్, ఆగస్టు 21(విజయ క్రాంతి): విద్యాభివృద్ధికి ఉసాట్ (వన్ స్కూల్ ఎట్ ఎ టైం) సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. డబిల్ పూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.90 లక్షల వ్యయంతో ఉసాట్ సంస్థ నిర్మించిన ఐదు తరగతుల గదులను ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలను జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక బెంచీలు, కుర్చీలు, లైబ్రరీ వంటి సదుపాయాలు కూడా సమకూర్చాలన్నారు.
మాజీ ఎంపీపీ రజిత రాజ్ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి చొరవ తీసుకొని గదులు నిర్మింప చేశారన్నారు. వీరి కృషివల్లే ఉసా టు సంస్థ ఈ గ్రామంలో తరగతి గదుల నిర్మాణానికి ముందుకొచ్చిందన్నారు. నిధులు అందించిన నిర్మల జే పుల్లూరు, సింక్రాన్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రజిత రాజా మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి, నిర్మల జే కొల్లూరు, నరసింహారావు, మాజీ సర్పంచ్ గీత భాగ్యరెడ్డి, దామోదర్ రెడ్డి, భాస్కర్ యాదవ్, గోపని వెంకటేష్ యాదవ్, సంజీవరావు, భాగ్యరెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.