calender_icon.png 22 August, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాండూర్ మున్సిపల్ కమిషనర్‌పై బదిలీ వేటు

22-08-2025 01:23:12 AM

రాష్ట్ర కార్యాలయానికి అటాచ్.. మెమో జారీ

తాండూరు ,21 ఆగస్టు, (విజయక్రాంతి) వికారాబాద్ జిల్లా...తాండూర్ మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహ రెడ్డి పై బదిలీ వేటు పడింది. రాష్ట్ర సిడిఎంఏ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడుల నేపథ్యంలో బది లీ వేటు పడిందన్న చర్చ పట్టణంలో జోరుగా సా గుతోంది.

ఏసీబీ దాడులు జరిగే సమయంలో కమిషనర్ కార్యాలయంలోనే ఉన్నారు. దాడులు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న కమిషనర్ విక్రమసింహారెడ్డి అక్కడి నుండి జారుకోవడం పై పలుఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నూతన కమిషనర్ గా గ్రేడ్ 3 అధికారి యాదగిరి పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనితెలుస్తుంది.