calender_icon.png 31 December, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కసరత్తు షురూ

31-12-2025 12:14:09 AM

  1. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు
  2. జనవరి 10న ఓటర్ల తుది జాబితా 
  3. ఓటర్ల జాబితా పరిశీలన ప్రారంభం

మహబూబాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చే సింది. 117 మున్సిపాల్టీలతో పాటు 6 కా ర్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నోటిఫికేషన్ జా రీ చేయడంతో రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల కో లాహలం ప్రారంభం అయ్యింది. నిన్న మొ న్నటి వరకు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగగా, ఇప్పుడు పట్టణాల్లో ఎన్నికల సందడి మొదలు కానుంది.

ఉమ్మ డి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 30,31 తేదీల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించి, జనవరి 5న మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన తరువాత, 6న జిల్లా స్థాయిలో పరిశీలించి 10న ఓటర్ల తుది జాబితా ప్రకటించాలని ఆదేశించారు. దీనితో మున్సిపల్ అధికారులు ఎన్నికల కసరత్తు ప్రారంభించారు.

ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో అధికారులు మంగళవారం ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. వార్డుల వారిగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితా పరిశీలన ప్రారంభించారు. రెండు రోజులపాటు ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపాలిటీల వివరాలు

వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, ములుగు జిల్లాలో ములుగు, మహ బూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, జనగామ జిల్లాలో జనగామ, స్టేషన్ ఘనాపూర్, హనుమకొండ జిల్లాలో పరకాల, భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆరు జిల్లాల్లో జయశంకర్ భూపాలపల్లి, మ హబూబాబాద్, ములుగు, జనగామ జిల్లా కేంద్రాల్లోని మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే ఆయా జిల్లాల పరిధిలోని ఎనిమిది మునిసిపాలిటీల్లో వా ర్డు కౌన్సిలర్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.

మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య

పరకాల 22 వార్డులు, జనగామ 30 వా ర్డులు, స్టేషన్ ఘనపూర్ 18 వార్డులు, భూ పాలపల్లి 30 వార్డులు, మహబూబాబాద్ 36 వార్డులు, డోర్నకల్ 15 వార్డులు, కేసము ద్రం 16 వార్డులు, మరిపెడ 15 వార్డులు, తొ ర్రూరు 16 వార్డులు, నర్సంపేట 30 వార్డు లు, వర్ధన్నపేట 12 వార్డులు, ములుగులో 20 వార్డులున్నాయి.