31-12-2025 12:14:10 AM
టీపీసీసీ రాష్ట్ర ఆదివాసీ వైస్ చైర్మన్ లింగంనాయక్
మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 30: కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని టీపీసీసీ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ లింగంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నాపై నమ్మకంతో రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ కు వైస్ చైర్మన్ గా నియామకం చేసినందుకు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, టీజీఎంఎఫ్సీ చైర్మన్ కొత్వాల్, ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ విక్రాంత్ భూరియ , వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతున్న.
నేను గతంలో పది జిల్లాలకు ఆదివాసి కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ కోఆర్డినేటర్ గా పనిచేయడం చేయడం జరిగిందన్నారు. రాష్ట ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజన తండాలకు తీసుకెళుతామని అన్నారు. గిరిజన తండాల్లో కాంగ్రెస్ భావాజాలాన్ని తీసుకెళ్లి, పార్టీని పటిష్టం చేసే విధంగా కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.
ఆనంతరం రాష్ట్ర అదివాసి కాంగ్రెస్ వైస్ చైర్మన్ గా నియమితులైన లింగం నాయక్ ను పార్టీ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిది జహీర్ అక్తర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, డీసీసి మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు శేఖర్ నాయక్, ప్రవీణ్ కుమార్, రాములు నాయక్, చందర్ నాయక్, రవి నాయక్, తులసి రామ్ నాయక్, రాము నాయక్, యాదగిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.