calender_icon.png 19 December, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల సమన్వయంతోనే ఎన్నికలు ప్రశాంతం

18-12-2025 12:00:00 AM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి, డిసెంబర్ 17 : జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తవ్వడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అంకితభావంతో పనిచేసిన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది, పోలీస్ శాఖ, రవాణా శాఖ, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారుల సహకారం అభినందనీయమని తెలిపారు.

అలాగే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించిన  అభ్యర్థులు, మీడియా ప్రతినిధులకు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు కలెక్టర్  కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పండుగగా నిలిచిన గ్రామ పంచాయతీ ఎన్నికలనువిజయవంతంగా పూర్తిచేయడంలో అందరి సహకారం కీలకమైందని కలెక్టర్ పేర్కొన్నారు.