17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

పాత పేరుతోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

10-02-2026 12:00 AM

రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య

ఎర్రుపాలెం ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి):  కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టానికి తూట్లు పొడిచే విధంగా ప్రయత్నం చేస్తుందని ఉపాధి హామీ పథకం లో ఎటువంటి మార్పులు లేకుండా పాత పేరు తోనే కొనసాగించాలని కార్మిక వర్గాలకు తీవ్ర నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య డిమాండ్ చేశారు.

మండల కేంద్రమైన ఎరుపాలెం తాసిల్దార్ కి  ఫిబ్రవరి 12వ తేది న జరిగే సార్వాత్రిక సమ్మెలో ఉపాధిహామీ కార్మికులకు పాల్గొనటానికి పనికి సెలవు ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ కార్మికుల మెడలకు ఉరితాలను బిగించే లేబర్ కోడ్ లను తీసుకొని వచ్చి కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటుందని విమర్శించారు.

ప్రభుత్వం రైతులకు అందిస్తున్న యూరియా పంపిణీలో  ఫెర్టిలైజర్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గామాసు   జోగయ్య, మండల వృత్తి సంఘం నాయకులు నాగులవంచ వెంకటరామయ్య, రైతు సంఘం నాయకులు ఆo గోతు వెంకటేశ్వర్లు, మేడగాని తిరుపతిరావు, డివైఎఫ్‌ఐ నాయకులు దివ్వెల వీరాంజనేయులు, వేములవేంకటేశ్వరవు తదితరులు పాల్గొన్నారు.