calender_icon.png 6 September, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అడ్డూ అదుపూలేని ఇసుక దందా

04-09-2025 01:50:16 AM

-యథేచ్ఛగా జంపన్నవాగులో ఇసుక తవ్వకాలు

-అక్రమంగా తరలుతున్న ఇసుకకు గ్రామస్తుల అడ్డుకట్ట

-పోలీసులకు పట్టుబడిన ఇసుక లారీలు, మూడు జేసీబీలు లారీలు 

-స్వాధీనం చేసుకున్న పోలీసులు

ములుగు, తాడ్వాయి, సెప్టెంబరు3 (విజయక్రాంతి ): అడ్డు అదుపులేకుండా కొందరు వ్యక్తులు జంపన్నవాగులోని ఇసుకను తరలిస్తున్నారు. అనుమతి పేరుతో అక్రమంగా లారీల్లొ తరలిస్తున్నారు మేడారం, ఊరట్టం, కొత్తూరు, రెడ్డిగూడెం, నార్లాపురం గ్రామాల ప్రజలు చూస్తుండగ తరలిపోతున్నాయి ఇదేమిటని అడిగితె ఇందిరమ్మ ఇండ్లకని అంటున్నారు. ఉన్నట్టుండి మేడారం గ్రామస్తులు కొందరు ఇసుకలారీలపై దష్టిపెట్టారు. అనుమతిలేకుండా పోతున్నట్టు తెల్సింది. జంపన్నవాగులోని ఇసుకను ఓడ్డుకు డంపింగ్ జెసిబిలతొ చేశారు.

మూడు మీషన్లు నడుస్తున్నాయి. ప్రతీరోజు సాయంత్రం ముగిశాక చీకటికాగానే లారీలు నార్లాపురం మీదనుంచి పస్రావయాగా వెల్లిమిగతాలారీల్లొ కలిసి అనుమానం రాకుండా పోతున్నాయి. మరో వైపున తెల్లవారు జామున లోడైనలారీలు రెండునుంచి 10 లారీలదాక పోతున్నాయి. చీకటి అయినందున ఎవరు సాహశించలేక పోతున్నారు. సోమవారం ఉన్నట్టుండి లారీలు పోవడానికి ఆలస్యం అయింది. గ్రామస్తులు జంపన్నవాగు వైపున దష్టిపెట్టారు. ఇసుకతొ ఉన్నలారీలు తరలిపోయెందుకు సిద్దం కావడంతొ పోలీసులకు సమాచారం తెలిపారు 

పోలీసులకు పట్టుబడిన లారీలు, జేసీబీలు!!

గ్రామస్తుల సమాచారం అందడంతో పోలీసులు మేడారాన్ని సందర్సించారు. జంపన్నవాగు వైపున ఉన్నలారీల వద్దకు వెల్లగా ఇసుకలారీలు ,మూడు జెసిపిలు ఉన్నాయి లారీల డ్రైవర్ల వద్ద అనుమతులు ఉన్నాయా, వేబిల్స్ చూపించమని పోలీసులు ప్రశ్నించారు. ఏమి ఆదారాలు లేవనీ తేలింది ఇసుకను ఎవరుతీయమన్నారని అడగ్గా వెంకటాపురంకు చెందిన ఓవ్యక్తి పేరు చెప్పినట్లు తెల్సింది దీంతొ అక్రమంగా పోతున్నట్లు వెల్లడి కావడంతొ ముడులారీలు, ఇసుకను తోడుతున్న మూడు జెసీబిలను అదుపులోకి తీసుకున్నారు. ష్టేషన్ కు తరలించి కేసునమోదుచేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అంతెకాకుండా డ్రైవర్లపై కుడ కేసునమోదుచేసినట్లు తెలిపారు. 

వెలుగులోకి వచ్చిన ఇసుక దందా..

ఇసుకలారీలు పట్టుబడటంతో ఇసుకదందా వెలుగులోకి వచ్చింది. అక్రమదా రులకు అడ్డుకట్ట పడినట్లేనా? లేక అనుకోకుండా పట్టుబడి వైనం జరిగిందా అనె సందేహలు వ్యక్తం అవుతున్నాయి. ఇసురవాణాపై పోలీసులు, రెవిన్యూ అదికారులు దస్టిపెట్టి ఇసుకదందాకు అడ్డుకట్టవేసేనా అనిపలు గ్రామాల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.