02-09-2025 12:54:54 AM
-తొమ్మిది రోజుల పాటు నిర్వహణ
-తొలిరోజు వేయిస్తంభాల గుడిలో..
-గొప్ప కార్నివాల్‌గా నిర్వహిస్తాం
-గిన్నిస్ బుక్‌లో రికార్డు నెలకొల్పడమే లక్ష్యం
-సంస్కృతికశాఖ మంత్రి జుపాల్లి కృష్ణారావు
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): ఈ నెల 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని సాంస్కృతిక, పర్యాటకశాఖమంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గిన్నిస్‌బుక్‌లో చోటు సాధించడమే లక్ష్యంగా ఈ నెల 29న ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుతామని మంత్రి స్పష్టం చేశారు. బతుకమ్మ పండుగను గొప్ప కార్నివాల్‌గా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సోమవారం మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 21వ తేదీన వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. పీపుల్స్ ప్లాజాలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో విద్యార్థులంతా పాల్గొనే లా వేడుకలుంటాయని తెలిపారు. బతుకమ్మకు జాతీయస్థాయి ప్రచారం కోసం కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు.
రాష్ర్టంలో నిర్వహించే పండగల విశిష్టత, మన సంస్కృ తి అంతర్జాతీయ పర్యాటకులకూ తెలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి, వారిని ఆకర్షించాలనే ప్రత్యేక కార్యచరణతో ముందుకువె ళ్తున్నామని చెప్పారు. బతుకమ్మ కేవలం ఒక పండుగ కాదని, తెలంగాణ ఆత్మగౌరవమని ఉద్ఘాటించారు. ప్రకృతిని మన సంస్కృతిలో భాగస్వామ్యం చేసుకుంటూ నిర్వహించే ఈ వేడుక ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. బతుకమ్మ ఖ్యాతిని అంతర్జా తీయ స్థాయిలో పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని, 9 రోజుల పాటు 9 వేడుకలు, కార్య క్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.
బతుకమ్మ వేడుకల షెడ్యూల్..
-సెప్టెంబర్ 21న వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి వద్ద ప్రారంభం
-సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు, ప్రతిరోజు 3 జిల్లాల్లోని ముఖ్య ఆలయాలు, పర్యాటక, సాంస్కృతిక ప్రదేశాల్లో వేడుకలు
హైదరాబాద్‌లో కార్యక్రమాలు..
-ట్యాంక్‌బండ్ వద్ద సెప్టెంబర్ 27న బతుకమ్మ కార్నివల్ ఈవెనింగ్
-సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రయత్నం, పదివేల కంటే ఎక్కువ మంది మహిళలతో గరిష్ఠ సమూహంతో వేడుకలు
-సెప్టెంబర్ 29న పీపుల్స్ ప్లాజా వద్ద ఉత్తమ బతుకమ్మ పోటీలు
-సెప్టెంబర్ 29న -ఐటీ రంగం ఉద్యోగులు, ఆర్‌డబ్ల్యూఏల పోటీ
-సెప్టెంబర్ 30న -ట్యాంక్‌బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోళి
ప్రత్యేక కార్యక్రమాలు..
-బతుకమ్మ సైకిల్ రైడ్ (సెప్టెంబర్ 28)
-మహిళల బైకర్స్ రైడ్ (సెప్టెంబర్ 29)
-విన్టేజ్ కార్ ర్యాలీ (సెప్టెంబర్ 30)
-సెప్టెంబర్ 25 నుంచి 4 రోజుల పాటు మాదాపూర్‌లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ థీమ్‌తో ఆర్ట్ క్యాంప్
-సరస్ బజార్ పీపుల్స్ ప్లాజాలో మహిళల స్వయంసహాయక సంఘాలతో కార్యక్రమం
-బతుకమ్మ ఆకారంలో అలంకరించిన ఫ్లోట్స్ హుస్సేన్‌సాగర్‌లో విడదల
-రాష్ర్టవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో బతుకమ్మ సంబురాలు
-హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో బతుకమ్మ వర్క్‌షాప్‌లు
-సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు ఢిల్లీ, ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చే అన్ని విమానాల్లో బతుకమ్మ వెల్‌కమ్ డ్యాన్స్ ప్రదర్శన
బతుకమ్మను ప్రపంచవ్యాప్తం చేయాలి: మంత్రి సీతక్క
తెలంగాణలో ప్రజలందరూ కలిసి బతుకమ్మ పండుగను కాపాడి, ప్రపంచవ్యాప్తం చేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ పండుగ పువ్వులనే కాదు, చెరువులను కూడా పూజించే పండుగ, చెరువు కట్టల మీద ఆట పాటలతో ఆడబిడ్డలు ఆడి పాడే పండుగకు ప్రతీక. ప్రభుత్వపరంగా కార్యక్రమాలు తీసుకోవడం చాలా సంతోషం వ్య క్తం చేశారు. విమానాల్లో తిరిగేవాళ్లు కూడా పండగ విశిష్టత గురించి తెలుసుకునేలా ఈ కార్యక్రమాలు ఉంటాయని, ఇండిగో సావెనీర్‌లో కూడా చేర్చారని పేర్కొన్నారు. మన తంగేడుపూలు, కట్ల పూలు, గునుగు పూలు గుమ్మడి పూవ్వుల విశిష్టతను తెలియజేసేలా బతుకమ్మ ఉన్నదన్నారు.
పర్యాటక రంగానికి ప్రచారం: మంత్రి కొండా సురేఖ
బతుకమ్మ వేడుకల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం కల్పిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ పండుగ గురిం చి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి దేశవిదేశాలకు తెలిసేలా చేస్తామని చెప్పారు. పర్యాటక శాఖ, మహిళలను భాగస్వామ్యం చేస్తూ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఆడబిడ్డల పోరుగడ్డ అయిన వరంగల్‌లో తొలి బతుకమ్మ వేడుకలు నిర్వహిం చడం హర్షిందగిన విషయమన్నారు.