03-08-2025 12:00:00 AM
సత్యరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్‌రెడ్డి అడిదాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. తాజాగా మేకర్స్ ఓ మాస్ నంబర్ ‘ఇస్కితడి.. ఉస్కితడి’ను వదిలారు. ఈ స్పెషల్ సాంగ్‌లో ఉదయభాను అందరినీ ఆకట్టుకున్నారు. ‘డానే అడుగుపెడితే దుమ్ము లేవాలే..
సూసేటోళ్ల కళ్లు జిల్లుమనాలే..’ అంటూ సాగే ఈ పాటకు రఘురామ్ సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన బాణీ సమకూర్చారు. సత్యం రాజేశ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయభాను, క్రాంతికిరణ్ వివిధ పాత్రలు పోషించారు. ఇందులో ఉదయభాను పాత్ర ప్రత్యేకంగా ఉండబోతోందని తెలుస్తోంది.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయిన ఈ సినిమా విడుదల తేదీని టీమ్ త్వరలోనే ప్రకటించనుంది. ఈ చిత్రానికి సంగీతం: ఇంఫ్యూజన్ బ్యాండ్; డీవోపీ: కుశేందర్ రమేశ్‌రెడ్డి; ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేశ్; ఆర్ట్: శ్రీనివాస్ పున్నా.