21-07-2025 01:56:57 AM
- ఐదుగురు మృతి
- రంగంలోకి రెస్క్యూ బృందాలు
బాలి, జూలై 20: ఇండోనేషియాలోని సు లవేసి ద్వీపం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఐ దుగురు ప్రయాణికులు చనిపోయారు. చా లా మంది ప్రయాణికులు మంటలు అంటు కున్న విషయం తెలిసి నీటిలోకి దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు.
విష యం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్య లు చేపట్టాయి. నౌక ప్ర మాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్క ర్లు కొట్టాయి. ప్రయాణికులు, సిబ్బంది సహా 284 మందిని రక్షించినట్టు అధికారులు వెల్లడించారు. అసలు నౌకలో ఎంతమంది ఉన్నారు. ఎంత మంది గాయపడ్డారనే విషయాలపై స్పష్టత లేదని వారు పేర్కొన్నారు.