calender_icon.png 19 August, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్

19-08-2025 01:24:36 AM

కొత్తపల్లి, ఆగష్టు 18(విజయక్రాంతి):సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొట్టమొదటి బహుజన చక్రవర్తి వీరుడని, పోరాట యోధుడిని బిజెపి నాయకులు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. ఒక పోరాట యోధున్ని స్మరించుకోవడం అంటే వారు చూపిన త్యాగాలను స్మ రించుకోవడమేనని పాపన్న గౌడ్ చరిత్రను మరువలేమని,సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లోని రేకుర్తి చౌరస్తా మరియు అల్గునూర్ మానేరు వంతెన పై గల పాపన్న గౌడ్ విగ్రహాలకు.

మాజీ కార్పొరేటర్లు, బిజెపి నాయకులు మరి యు గౌడ సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సం దర్భంగా మాజీ మేయర్ వై.సునీల్ రావు మాట్లాడుతూ అణగారిన వర్గాలు,పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన మహనీయుల చరిత్రను మరువకుండా భావితరాలకు వారి పోరాట పటిమను తెలియజేయాలన్నారు. తెలంగాణ గడ్డపై పుట్టి ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి కులవృత్తులను కాపాడుకోవడానికి పీడిత ప్రజల కోసం గోల్కొండ నవాబులపై పోరాటం చేసిన వీర యోధుడు పాపన్న గౌడ్ అని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సుధగోని మాధవి-కృష్ణ గౌడ్, గుగ్గిళ్ళ శ్రీనివాస్ గౌడ్, ఏదుల్ల రాజశేఖర్, గౌడ సంఘం నేతలు- స్థానిక నాయకులు గుర్రం శ్రీనివాస్, ఎల్లయ్య, సత్యం, వేంకటేశం, నేరెళ్ల అజయ్, మాజీద్ మరియు బీజేపీ నాయకులు ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, బండారి గాయత్రి, సుమన్ గౌడ్, మహేష్, బాలు,హమీద్‌పాల్గొన్నారు.