calender_icon.png 17 August, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను కష్టాల్లోకి నెట్టిన కాంగ్రెస్

16-08-2025 12:00:00 AM

  1. యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం

మాజీ మంత్రి హరీశ్‌రావు

నంగునూరు, ఆగస్టు 15: యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రైతులను కష్టాల్లోకి నెట్టిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల యూరియా కొనుగోలు కేంద్రం వద్ద రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఎరువుల కోసం రైతులు తెల్లవారుజామున 5 గంటలకే వచ్చి చెప్పులు క్యూలో పెట్టి ఎదురుచూడాల్సిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రవాణా ఖర్చులు లేకుండా ఇంటింటికీ ఎరువులు పంపామని, కానీ ఇప్పుడు యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోందన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డికి ముందుచూపు లేకపోవడం, కాంగ్రెస్ చేతకానితనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ఈ వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగు తగ్గినా కూడా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. యూరియా సరఫరా చేయడంలో విఫలమైన కాంగ్రెస్, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

రు పార్టీల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ఎరువులు తీసుకురాలేదని, రైతుల కంటే వారికి పదవులే ముఖ్యమని ధ్వజమెత్తారు. నానో యూరియా వాడాలంటే డ్రోన్లకోసం ఎకరానికి రూ.500 ఖర్చు అవుతుందని, లేకపోతే కూలీలకు రోజుకు రూ.500 చొప్పున ఇద్దరిని పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఎరువుల సబ్సిడీని ఎగ్గొట్టడానికి ప్రభుత్వం ఈ విధంగా రైతులను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తామని బెదిరించైనా సరే కేంద్రం నుంచి ఎరువులను తేవాలని డిమాండ్ చేశారు