07-01-2026 12:00:00 AM
అమరావతి, జనవరి 6: డాక్టర్ బీఆర్ అం బేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ బావిలో సోమవారం చెలరేగిన మంటలు మంగళవారం కూడ అదుపులోకి రాలేదు. బ్లోఅవుట్ వద్ద పరిస్థితి అలాగే కొనసాగుతున్నది. ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు, అగ్నిమాపక సిబ్బం ది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.ప్రమాద స్థలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని, బావిని చల్లబరిచే పనులు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతానికి నీరు, మట్టితో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు రెండు లారీల్లో కూలెంట్ ను తీసుకువస్తున్నారు.పెద్ద పైప్‌లైన్ ద్వారా ఓ గొడుగు రూపంలో నీటిని లోపలికి పంపుతున్నారు. కాగా నిన్నటితో పోల్చితే మంగళవా రం మంటల తీవ్రత కాస్త తగ్గింది. 50 శాతం వరకు మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఇప్పటికే ఇరుసుమండ, మోరి గ్రామాలను అధికారులు ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం మోరి-5 బావిలో రిపేర్ పనులు చేస్తుండగా అధిక పీడనంతో గ్యాస్, ముడి చమురు బయటకు చిమ్మి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనతో సమీప గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
పునరావాస కేంద్రాలకు 500 కుటుంబాలు: అమలాపురం ఎంపీ
ఇరుసుమండలో బ్లోఅవుట్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు ప్రస్తుతం మంటలను అదుపు చేసే ప్రక్రియలో ఉన్నారని అమలాపురం ఎంపీ హరీశ్‌మాధుర్ పేర్కొన్నా రు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ 500 కుటుంబాలను పునరావాస కేంద్రాలకకు తరలించినట్లు చెప్పారు. బాధితులకు అన్ని సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపా రు. వారికి భోజనం, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. కాగా గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సాధారణ పరిస్థితి నెలకొల్పేం దుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందించాలని అధికారులకు సూచనలు చేశా రు. మంటలను అరికట్టేందుకు జాతీయ, అం తర్జాతీయ స్థాయిలో అవసరమైన ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలన్నారు.
మంటల తీవ్రత తగ్గించేందుకు చర్యలు:ఓఎన్జీసీ
ఇరుసుమండ బ్లోఅవుట్‌పై ఓఎన్జీసీ కీలక ప్రకటన చేసింది. న్యూఢిల్లీకి చెందిన డైరెక్టర్(టెక్నాలజీ అండ్ ఫీల్డ్ సర్వీసెస్) విక్రమ్ సక్సీనాతో సహా ఓఎన్జీసీ సీనియర్ మేనేజ్‌మెంట్, క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ నిపు ణులతో కలిసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు కార్యాచరణ చేపట్టామని పేర్కొం ది. మంటల తీవ్రతను తగ్గించేందుకు నిపుణుల బృందం పనిచేస్తోందని, 600 మీటర్ల వ్యాసార్థంలో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి గాలి నాణ్యత, శబ్ధ స్ధాయిలను బృందం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని ఓఎన్జీసీ పేర్కొంది.