calender_icon.png 27 August, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కార్ బడులకు పూర్వ వైభవం

27-08-2025 01:36:10 AM

డాక్టర్ విజయభాస్కర్ :

తెలంగాణలోని ప్రభుత్వ బడులను.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. 2025--26 విద్యా సంవత్సరం నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరిట కోట్ల రూపాయల నిధులతో సొంత భవనాల్లో పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించనున్నారు. గతంలో ప్రభుత్వ బడులు అనగానే శిథిలావస్థకు చేరుకున్న గోడలు, రేకుల షెడ్లు, చెట్ల కింద చదువులు, ఉపాధ్యాయుల కొరత, చాలిచాలని నిధులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడం, మంచినీటి సౌకర్యం లేకపోవడంతో సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుండేవి.

గత ప్రభుత్వంలోనూ ప్రభుత్వ బడులు నిర్లక్ష్యానికి, నిర్లిప్తతకు గురయ్యా యి. 20 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే  విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పించింది. ఇందుకోసం ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో అమ్మ, ఆదర్శ పాఠశాలల పేరిట మరమ్మతుల కోసం నిధులను మంజూరు చేసింది. ప్రభుత్వ బడులకు నూతన భవనాలను నిర్మించడం, శిథిలావస్థకు చేరిన భవనాలను మరమ్మతులు చేయడం, మరుగు దొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం కల్పించడం లాంటివి గమనిస్తున్నాం.

గత ఎనిమిదేళ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు లేకుండా ఉన్న వ్యవస్థను మార్చివేసి ప్రభు త్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో కనీసం రెండు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు దాటిన వారికి బదిలీ ప్రక్రియ చేపట్టారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు అనగానే.. సర్వీస్ రూల్స్, సీనియర్.. జూనియర్, టె ట్ ఉత్తీర్ణత, ఇన్ సర్వీస్, డైరెక్ట్ రిక్రూట్మెంట్  ఇలా రకరకాల సమస్యలతో పలువురు ఉపాధ్యాయులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. రేవంత్ సర్కార్ అన్ని కోర్టు కేసులను ఎదుర్కొని రెండు సార్లు ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం ఉపాధ్యాయులందరూ రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను బోధించడానికి కృషి చేస్తున్నారు.

శ్రమ దోపిడీ.. వెట్టిచాకిరి

రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో భాషోపాధ్యాయులు గత ముప్పు సంవత్సరాల నుంచి పదోన్నతులు లేకుండానే శ్రమ దోపిడీ, వెట్టిచాకిరికి గురవుతూ వస్తున్నారు. శాసనమండలి ఎన్నిక లు రాగానే భాషోపాధ్యాయులకు పదోన్నతులు అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం.. ఎస్జీటీ ఉపాధ్యాయ మిత్రులు భాష పండితుల పదోన్నతుల్లో, సవరణల్లో తమకు అవకాశం ఇవ్వాలని హైకో ర్టును ఆశ్రయించడం.. హైకోర్టు స్టే ఇవ్వ డం, శాసన మండలి ఎన్నికలు ముగియగానే భాషోపాధ్యాయుల పదోన్నతుల వ్య వహారం అటక ఎక్కించడం జరుగుతూ వస్తుంది.

భాషోపాధ్యాయులు ఏ హోదా లో ఉద్యోగంలో చేరుతున్నారో అదే హో దాలో పదవీ విరమణ చేస్తుండటం బాధాకరం. ఉన్నత పాఠశాలలలో పనిచేస్తూ ప్రా థమిక పాఠశాల వేతనాలు తీసుకుంటూ మానసిక క్షోభకు గురతున్నారు. భాషోపాధ్యాయుల ఎంపిక ఉన్నత పాఠశాలలలో స్కూల్ అసిస్టెంట్ లకు సమానంగా ఉం టుందని.. దీంతో భాషోపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ గా పరిగణించాలని సుప్రీం కోర్టు కూడా సూచనలు, సలహాలు ఇచ్చింది.

2005లో అప్పటి ప్రభుత్వం 1/2005 ఆక్ట్ పేరిట దానిని అడ్డుకోవడం జరిగింది. ఆర్థిక ప్రయోజనాలు లేకపోయి నా నోషనల్ కింద పరిగణించి 1/2005 ఆక్ట్ ను రద్దు చేసి భాషోపాధ్యాయులకు ఉన్నత పాఠశాలలలో చేరినప్పటి నుంచే స్కూల్ అసిస్టెంట్ లుగా పరిగణించాలని.. రేవంత్ సర్కార్ తప్పకుండా తమ కోరికను పరిష్కరిస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.

యజ్ఞంలా పుస్తక పఠనం..-

ఆగస్టు  21 నుంచి అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవమైన సెప్టెంబర్ 8 వ తేదీ వరకు ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పఠన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు చదవడం, అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న విషయాన్ని వ్యక్తీకరించడం లాంటివి చేయడం ద్వారా అభ్యసన ఫలితాలు సాధించడానికి అవకాశముంది. విద్యార్థులు పఠన శక్తి ద్వారా మానసిక ఆరోగ్యం, సర్వోన్నతాభివృద్ది జ రిగి పాఠ్యపుస్తకాల లక్ష్యం నెరవేరుతుంది. పుస్తక పఠనం ద్వారా ఉన్నత ఉద్యోగాలు సాధించడం సులభమవుతుంది.

అందుకోసం ఎన్నడు లేని విధంగా 2025--26 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే వేసవి సెలవుల్లోనే విద్యార్థులకు పాఠ్య పు స్తకాలు, యూనిఫాంలను పంపిణీ చేశారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తో పాటు ఉదయం అల్పాహారంగా రాగి జావ అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్రీడలకు ప్రోత్సాహం కల్పించడం, పౌష్ఠికాహారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

నాణ్యమైన విద్య..

రాష్ర్టంలోని 33 జిలాల్లో ఉన్న ప్రభు త్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో అన్నింటికీ కంప్యూటర్‌లను పంపిణీ చేశారు. ఉచితంగా కరెంటు, ఉచిత ఇంటర్నెట్ సౌక ర్యం, ఇంటర్నెట్ పార్ట్ ప్యానల్ (ఐ.ఎఫ్. ఎల్) ద్వారా బోధన, డిజిటల్ ద్వా రా బోధించడానికి వేసవి సెలవుల్లో జిల్లా విద్యాశాఖాధికారులకు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ స్కూల్‌లకు, ప్రధానోపాధ్యాయులకు, అ న్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులకు రెండు, మూడు స్పెల్‌లలో ఐదు రోజుల శిక్షణా తరగతులు నిర్వహించారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చిన్న కూగ్రా మం నుంచి పట్టణాల వరకు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదువును అభ్యసించాలని కోరుకుంటున్నారు. దీనిని గ్రహించిన ప్ర స్తుత ప్రభుత్వం.. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో విద్యార్థులకు అర్థమ య్యే రీతిలో సులభ పద్ధతిలో ఆంగ్ల మా ధ్యమంలో విద్యాబోధన చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉన్నత చదువులు, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చేత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు.

అంతేగాక ఉపాధ్యాయుల పోస్టుల ను భర్తీ చేసి ప్రభుత్వ బడుల్లో ఎలాంటి ఖాళీలు లేకుండా అన్ని సబ్జెక్టులకు టీచర్ల భర్తీ ప్రక్రియను చేపట్టారు.అనేక మంది నిరుద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్) నిర్వహించి డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. 

బడులకు మహర్దశ..

రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో ప్రభుత్వ, పంచాయతీరాజ్ బడులల్లో పూర్వ వైభ వం కనిపిస్తుంది. ఒకప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోయిన పాఠశాలలు ఇప్పు డు మళ్లీ కళకళలాడుతున్నాయి. మంత్రు లు, ఎమ్మెల్యేలు, అధికారులతో మాట్లాడి అడ్మిషన్ల కోసం సిఫారసు చేసే స్థాయికి ప్రభుత్వ బడులు చేరాయి. ప్రభుత్వ బడు ల్లో కొన్ని ప్రాంతాలలో, కొన్ని జిల్లాల్లో నో అడ్మిషన్లు అనే బోర్డు లు దర్శన మిస్తున్నా యి.ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో  సౌకర్యాలను మెరుగుపరిచేందుకు  పాఠశాల పూర్వ విద్యార్ధులు, కొన్ని స్వచ్ఛం ద సంస్థలు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తున్నారు.

ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందుబాటు లో ఉం టుందని తల్లిదండ్రులకు, విద్యార్థులకు నమ్మకం కలిగించడానికి సొంత భవనాలను నిర్మించడం, ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలలకు పెయింటింగ్ చేయ డం చేసి నాణ్యమైన విద్యను అందించడా నికి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారు. సర్కార్ బడులకు పూర్వ వైభవం తెచ్చే దిశగా రాష్ర్ట ప్రభు త్వం కూడా ఎప్పటికప్పుడు సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. 

వ్యాసకర్త సెల్: 9290826988