18-09-2025 12:00:00 AM
-శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
-అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
-ప్రభుత్వం విద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
-ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ (విజయక్రాంతి): ఎంతోమంది త్యాగదనుల పోరాట ఫలితమే నేడు స్వాతంత్య్ర ఫలాలను పొందుతున్నామని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. బుదవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్లా, డీఎఫ్‌ఓ నీరజ్ కుమార్, ఎమ్మెల్యే కోవలక్ష్మిలతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అంతకు ముందు పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి జాతీయ జండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ఆభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ఆరు పథకాలలో ప్రజాపా లన ధరఖాస్తులను పరిష్కరించి జిల్లాలో అర్హులైన లబ్దిదార లకు పథకాల ఫలాలను అందించడం జరుగుతుందన్నారు. మహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా ఆడబిడ్డలకు రూ.6790 కోట్లు ఆదా అయ్యయ న్నారు. ఇటివలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.08 కోట్ల మంది వ హిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకొని రూ.47.26 కోట్ల లబ్ది పొందర న్నారు.
జిల్లాలో 78,500 కుటుంబాలకు మహిళలను కుటుంబ యాజమానిగా గుర్తుంచి గ్యాస్ రాయితీ సొమ్మును వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నా రు. ఆరోగ్య శ్రీ పరిదిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెంచడం జరిగిందని జిల్లాలో ఈ పథకం ద్వారా 11997 మంది పేదలు వైద్య చికిత్సలు పొందరన్నారు. జిల్లా కు 7398 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా 4868 ఇండ్లు మార్కవుట్ చేయబడి 1525 ఇండ్లు బేసిమెంట్ స్థాయి హర్త య్యయని, 66 ఇండ్లు రూప్ దశలో ఉన్నాయని, 17 ఇండ్లు నిర్మాణం పూర్తి కావడం జరిగిందన్నారు. గృహజ్యోతి పథకం కింద జిల్లాలోని అర్హులైన 72,817 కుటు ంబాలకు రూ.31.58 కోట్లు రాయితీ అందించడం జరిగిందన్నారు. జిల్లాలో రైతు రుణమాపీ కింద 51,523 మంది రైతులకు రూ. 465 కోట్లు అందించడం జరిగిందన్నారు. రైత బరోసా కింద జిల్లాలో 2025 వానకాలంలో 1,38, 306 మంది రైతుల ఖాతాల్లో రూ.251 కోట్లు జమచేయడం జరిగిందన్నారు.
రైతు బీమా కింద జిల్లాలో 75,830 మంది రైతులు పేరు నమోదు చేసుకోగా ఇప్పటి వరకు 501 మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 25 కోట్లు వారి నామినీల ఖాతాలో జమ చేయడం జరిగింద న్నారు. ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 914 స్వయం సహాయక సంఘాలకు రూ.58.11 కోట్ల రుణాలు అందించడం జరిగిందన్నారు. జిల్లాలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో 4356 దరఖాస్తులు రాగా 322 దరఖాస్తులు పరిష్కరిం చబడ్డాయని, మిగతా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నయన్నారు.
ప్రభుత్వం నిర్వహిం చిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో 4356 దరఖాస్తులు రాగా 322 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయని మిగతా దరఖాస్తులు పరి శీలనలో ఉన్నయన్నారు. ప్రభుత్వం ప్రజాపంపిణీ ద్వారా సన్న బియ్యం అందిస్తుం దన్నారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం 54205 దరఖాస్తులు రాగ 48.028 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రభుత్వం విద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్లను నిర్మిం చబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్రావు, ఎల్డీవో సుశాంత్, జిల్లాలోని ఆయా శాఖల అదికారులు పాల్గొన్నారు.