10-02-2025 01:18:06 AM
వలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో ఏసీజే
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): భవిష్యత్ మధ్యవర్తిత్వానిదేనని, కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని కమ్యూనిటీ మీడియే టర్లకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ సూచించారు. సోమాజీగూడ సంస్కృతి రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ నెల 12వరకు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని వాలం టీర్లకు పిలుపునిచ్చారు. న్యాయస్థానాలపై పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంలో మధ్యవర్తిత్వం ప్రధాన భూమిక పోషించనుందని అభిప్రాయపడ్డారు.
మూడురోజుల పాటు 20 గంటలు శిక్షణ ఇవ్వనున్నట్లు టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ సభ్యకార్యదర్శి సీహెచ్ పం చాక్షరి పేర్కొన్నారు. వీరంతా ఆయా ప్రాం తాల్లో కమ్యూనిటీ సెంటర్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తామని వెల్లడించారు. శిక్షణా కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి 132 మంది హాజరయ్యారు.