calender_icon.png 23 November, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందూ ముస్లింలను రెచ్చగొట్టి పబ్బం గడుకునే చరిత్ర బండి సంజయ్‌ది!

10-02-2025 01:17:18 AM

* కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ తాజ్

కరీంనగర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): హిందూ ముస్లింలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే చరిత్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్గని, ముస్లింల రిజర్వేషన్లు వద్దు అని చెప్పడానికి నువ్వ ఎవరు అని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీతాజ్ అన్నారు.

ఆదివారం కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీలలో ముస్లింలను చేర్చవద్దంటూ కేంద్ర మంత్రి అనడం సరైనది కాఆదని, బీసీలకు ప్రభుత్వాలు రిజర్వేషన్ల పెంచితే ఇంతెందుకు పెంచారని మేము అడిగామా అని ప్రశ్నించారు.  ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్కిల్లో కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు అని కేంద్ర మంత్రి అంటున్నారు, పది సంవత్సరాల నుండి మా ప్రభుత్వం అక్కడ లేదు, కానీ తమిళనాడు, కేరళ, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలవలేదని, మరి మీది గాడిద గుడ్డు కాదా అని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు షహెన్షా కలియుద్దీన్, షహెన్షా, అబ్దుల్ బారి, సిరాజ్, బషీర్, షబానా మహ్మద్, అనీఫ్, ఇమ్రాన్, సుప్రీత్, ఫిరోజ్, పాకీర్, సయ్యద్ అన్బర్, సయ్యద్ ఖలీల్, మహ్మద్ కాజా, అక్రమ్, జమీల్, జమాల్తాన్, ముజాహిద్, ఖాజా ఖాన్, ఆరిఫ్ ఖాన్, లాయిక్ ఖాద్రి, తదితరులు పాల్గొన్నారు.