calender_icon.png 23 November, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంటులో ప్రస్తావించండి

10-02-2025 01:18:36 AM

జాతీయ సంఘర్షణ సమితి అధ్యక్షుడు రాజసింహుడు

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఈపీఎస్ పెన్షనర్ల కనీస పెన్షన్ పెంపుదల కోసం పార్లమెంటు ప్రస్తావించాలని ఎంపీ డీకే అరుణను ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఈపీఎస్ పెన్షనర్ల జాతీయ సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఏ.రాజసింహుడు విజ్ఞప్తి చేశారు.

ఆదివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణను కలిసి విన్నతిపత్రాన్ని సమర్పించి మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసి రిటైరైన ఉద్యోగులకు పీఎఫ్ నుంచి వచ్చే కనీస పెన్షన్ రూ.1,000 ఉందని, దాన్ని డీఏతో రూ.7,500 పెంచుతూ, పెన్షనర్ల భార్యాభర్తలకు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలనే తదితర డిమాండ్లతో అనేక సంవత్సరాలుగా కేంద్రాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో భగవంతు, నాగాంజనేయులు, మనోహర్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.