21-11-2025 12:44:03 AM
పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో 10 గ్రామాలు ఎంపిక
సంగారెడ్డి, నవంబర్ 20(విజయక్రాంతి): నీటి సంరక్షణ మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లో నీటి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా వాటర్ హెడ్ ఎన్జీవోల ఆధ్వర్యంలో నీటి సంరక్షణ సుస్థిరమైన నీటి భవిష్యత్తు కోసం సంఘాలను సాధికారపరచడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో జిల్లాలో ఎంపిక చేసిన పది గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవో, ఎంపీడీవో లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఏర్పా టు చేసిన ప్రారంభ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మానవజాతి మనుగడకు నీరే ప్రధాన కారణం అన్నారు ఎక్కడైతే నీరు పుష్కలంగా లభిస్తుం దో ఆ ప్రాంతాలు అభివృద్ధి పరంగా ముం దు వరుసలో ఉన్నాయన్నారు. తాగునీరు, సాగునీరు ప్రస్తుతం మన ప్రాంతంలో పుష్కలంగా లభిస్తున్నప్పటికీ నీటి వృధా కారణం గా నీటిని పొదుపుగా వాడుకోకపోవడం కా రణంగా తగినంత నీటిని నిలువ చేయకపోవడం కారణంగా భూగర్భ జలాల అత్యధి కంగా వినియోగించడం తదితర కాలంలో భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడి సమస్య ఉందని సమస్యలు తలెత్తకుండా ఉండడం కోసం ప్రభుత్వం నీటి నిలువ ప్రాధాన్యతను ప్రజలకు వివరించడం కోసం వాటర్షెడ్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి అవగాహన కల్పిస్తుంది అన్నారు.
కొన్ని పరిశ్ర మలు వర్షం పడిన సమయంలో నీటి వ్యర్థాలను చెరువులు, కుంటలు, వాగులలోకి వ దిలి నీటిని కలుషితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి కంపెనీలను గుర్తిం చి పంచాయతీ కార్యదర్శి ఆ కంపెనీలకు నోటీసులు ఇవ్వడం, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎంపిక చేసిన పది గ్రామాలలో భూగర్భ జలాల పెంపు కో సం ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలో మల్కాపూర్, గుంతపల్లి, హరిదాస్పూర్, బాచుపల్లి, మన్సాన్పల్లి, గొల్లపల్లి, మారేపల్లి, కొండాపూర్, మహమదాపూర్ ఇతర 10 గ్రామాలను జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి నీటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో బాలరాజు, భూ గర్భ జల అధికారి డా.జి.మోహన్, డిపిఓ సాయిబాబా, కార్ల్స్బర్గ్ మిస్టర్ సీసీ అల్పట్ బ్రూవరీ హెడ్, గ్రౌండ్ వాటర్‌ఎయిడ్ సునీల్ కుమార్, సీనియర్ టెక్నికల్ అడ్వైజర్, వాటర్ ఎయిడ్ ఆల్విన్ మనీష్ షా,వా టర్ ఐడ్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాసరావు, ఎంపీడీవోలు, ఏపీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.