19-11-2025 12:00:00 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల, నవంబర్18(విజయక్రాంతి): మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం వేములవాడ ఏరి యా ఆస్పత్రికి రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాల అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులారా అర్బన్ నక్సల్స్ నమ్మి ప్రాణాలు కోల్పోవద్దని హితవు పలికారు.
అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారన్నారు. వాళ్ల మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలు లేక తిరుగుతున్నారని, మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారకులన్నారు. మవోయిస్టులకు సపోర్ట్ చేసిన అర్బన్ నక్సల్స్ ద్రోహులన్నారు.తక్షణమే తుపాకీ వీడి జన జీవన స్రవంతిలో కలవాలని,మీకు మరో నాలుగు నెలలు మాత్రమే గడువు ఉందన్నారు.