20-09-2025 09:04:12 PM
సేవాలాల్ సేన అధ్యర్యంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి వినతి పత్రం అందజేత..
నవాబ్ పేట్: మైదాన ప్రాంతంలో గల తండాలను అభివృద్ధి చేయాలని సేవాలాల్ సేన మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్ నాయక్ అధ్యర్యంలో సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు అజయ్ నాయక్, కొర్ర శ్రీను, రాజ్ కుమార్, మైదాన ప్రాంత రాష్ట్ర ఇన్చార్జి రఘురాం రాథోడ్ లతో కలిసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy)కి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నోఏళ్లుగా ప్రభుత్వాలు మారిన మైదాన ప్రాంతంలో గల తండాలను ఎవరు పట్టించుకోవట్లేదని ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తాండల పరిస్థుతులు ఉన్నాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చొరవ చూపి మైదాన ప్రాంతంలో గల తండాలను అభివృద్ధి చేయాలనీ కోరారు. లంబడీలను దీనికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సానుకూలంగా స్పందించి దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తాండలా అభివృద్ధి కొరకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చందర్ నాయక్, అంగోత్ వేణు నాయక్, కోడావత్ రాజు, లక్ష్మణ్ నాయక్, శ్రీను నాయక్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.