calender_icon.png 26 November, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

25-11-2025 12:00:00 AM

మంత్రి అడ్ల్లూరి లక్ష్మణ్ కుమార్ 

కోరుట్ల రూరల్, నవంబర్ 24 (విజయ క్రాంతి):మహిళా శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కోరుట్ల మండలంలోని మోహన్ రావు పేట గ్రామంలో ఇందిరా మహిళా శక్తి ఇందిరమ్మ చీరె లు పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, వడ్ల కొనుగోలు కేంద్రాలు అప్పగించి మహిళలను అభివృద్ధి పథంలో నడిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో 41 వేల ఇందిరమ్మ చీరలను పంపిణి చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గర్భిణీ మహిళలకు అందించిన న్యూట్రీషియన్ కిట్ ను మళ్ళీ గర్భిణీలకు అందించాలని ఆయన మంత్రిని కోరారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కలెక్టర్ సత్య ప్రసాద్ , కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు, ఆర్డీవో జీవాకర్ రెడ్డి, డీఆర్డీవో రఘువరన్ , తహశీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీవో రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవీందర్ , ఏఎంసి చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల మండల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొంతం రాజం మహిళలుపాల్గొన్నారు.