calender_icon.png 12 August, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల ఆరోగ్య రక్షణే లక్ష్యం

12-08-2025 01:29:03 AM

మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ర్టంలోని పిల్లల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం చేపట్టినట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ తెలిపారు. హైదరాబాద్‌లోని షేక్‌పేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. ఈ నెల 18 వరకు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ర్టంలోని 33 జిల్లాల్లో 1 నుంచి 19 సంవత్సరాల లోపు వయసు గల 96 లక్షల 17 వేల మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించనున్నట్టు వెల్లడించారు.

హైదరాబాద్ జిల్లాలో 11 లక్షల మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని కలెక్టర్ హరిచందన చెప్పారు. కార్యక్రమంలో రాష్ర్ట హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, ప్రిన్సిపల్ బాలస్వామి, డీఐఓ డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.