12-08-2025 01:30:29 AM
మాదిగ రాజకీయ పోరాట సమితి అధ్యక్షుడు రమేష్ కుమార్
ముషీరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): నిరుపేదలు, వికలాంగులు, వృద్ధు ల పింఛన్లు, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభు త్వం ఇచ్చిన హామీల అమలుకై ఎమ్మార్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పింఛనుదారుల పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3వ తేదీన మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో తలపెట్టిన ’ఛలో-హైదరాబాద్-మహాగర్జన సభ’కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మాదిగ రాజకీయ పోరాట సమితి(ఎమ్మార్ పీఎస్) జాతీయ అధ్యక్షులు బి.ఎన్.రమేష్ కుమార్ మాదిగ తెలిపారు.
ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మార్ పీఎస్ రాష్ట్ర మీడియా కన్వీనర్‌గా సుంకశాల సం పత్ మాదిగకు నియామక పత్రం అందజేశాసి మాట్లాడారు. ఈ సభకు పెద్ద ఎత్తున వికలాంగులు, చేయూత పింఛన్ దారులు, దళితులు పాల్గొని, విజయవంతం చేయాలని ఆయన కోరారు. వికలాంగులకు కనీస పింఛన్ రూ.4 వేలు, పూర్తి అశక్తులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దళితులు, మాదిగలు, వికలాంగులు, వృద్ధులు, నిరుపేదలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చేయూత పింఛన్ దారులు ఏళ్ల తరబడి మోసపోతునే ఉన్నారని అన్నారు. వారిని ఓటు వేసే యంత్రాలుగానే చూస్తున్నారని, పాలకులు కేవలం మాటలతోనే వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు.
వృద్ధు లు, నిరుపేద మహిళలు, నేత, గీత కార్మికుల దీర్ఘకాలిక వ్యాధులు డయాలసిస్, హెచ్‌ఐవీ బాధితులకు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పింఛన్ ఇవ్వాలన్నారు. క్యాన్సర్ వం టి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ప్రత్యేక పింఛన్ కింద రూ.15 వేలు ఇవ్వాలన్నారు. సమితి రాష్ట్ర అధ్యక్షులు కత్తు ల కృష్ణమూర్తి మాదిగ, నాయకులు సురేష్, మేడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.