calender_icon.png 22 October, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి కల్పించడమే లక్ష్యం

22-10-2025 02:00:12 AM

-జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు

-హుజూర్‌నగర్‌లో 25న మెగా జాబ్ మేళా

-రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

-జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తదితరులు

హుజూర్ నగర్, అక్టోబర్ 21: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్‌నేషనల్ స్కూల్‌లో ఈ నెల 25న జరగనున్న జాబ్ మేళా ఏర్పాట్లను మంగళవారం మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రూప్1, 2 ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేసిందన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేసిందని,ప్రైవేట్ రంగంలో కూడా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని తెలిపారు.నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా ద్వారా ఉపాధి మార్గాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్ సహకారంతో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు ఇప్పటికే 205 కంపెనీలు,9500 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పరిశ్రమలు పాల్గొననున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులకు భోజన సదుపాయం కల్పించడమే కాకుం డా, పార్కింగ్, రిజిస్ట్రేషన్ కౌంటర్లు,కంపెనీ స్టాల్స్, భోజన ఏర్పాట్ల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామ ని తెలిపారు. స్థానిక నాయకులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి విజయవంతం చే యాలని మంత్రి సూచించారు.

మెగా జాబ్ మేళాను విజయవంతం చేయడానికి ఉమ్మ డి జిల్లాలో పేపర్ ప్రకటనలు, పాంప్లెట్లు, వాల్‌పోస్టర్లు, బస్సుల ద్వారా విస్తృత ప్రచా రం చేస్తున్నామని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్,జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ,డీట్ ప్రతినిధి వంశీ, సింగరేణి ప్రతినిధి చందర్, ఆర్డీవోలు శ్రీనివాసులు, సూర్యనారాయణ,జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గెల్లి రవి,తన్నీరు మల్లికార్జున్,కోతి సంపత్ రెడ్డి, తదితరులు,పాల్గొన్నారు.