26-11-2025 12:00:00 AM
ముషీరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ అసెంబ్లీ గన్‌పార్క్ వద్ద బీసీ జనసభ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. కాం గ్రెస్ పార్టీ మరోసారి రిజర్వేషన్ల విషయంలో బీసీలకు నమ్మకద్రోహం చేసిందని ఆరోపించారు.
కులగణన మొదలుకొని 42 శాతం బీసీల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎక్కడా చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీల గొంతు కోసి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైందని అన్నారు.
బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు ఇవ్వడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే అసెంబ్లీలో బిల్లు పేరుతో, జీవోల పేరుతో గందరగోళం సృష్టించి, చివరికి కో ర్టులు కొట్టేసే విధంగా రెడ్డి వ్యవహరించారని విమర్శించారు. నేషనల్ పొలిటికల్ జస్టి స్ ఫ్రంట్ చైర్మన్ విజిఆర్ నారగోని మాట్లాడుతూ.. కామారెడ్డి బిసి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలకు వెళితే.. రాష్ట్రాన్ని స్తంభింప చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కార్య క్రమంలో సేవాలాల్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్, బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఖైరతాబాద్ మాజీ కార్పొరేటర్ మహే ష్ యాదవ్, బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేష్ గౌడ్, బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాట మ నరసింహ యాదవ్, బిసి మహాసభ రా ష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర పటేల్, అఖిల భారతీయ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ యాదవ్, ఓయూ బిసి విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు కొమ్మనబోయి న సైదులు యాదవ్, నూకల మధు యా దవ్, భారీ అశోక్ యాదవ్, లింగం యాదవ్, చిరంజీవి యాదవ్, విద్యార్థి నిరుద్యోగ స మాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి రాజు యా దవ్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నారోజు రత్నాచారి, చిరం జీవి యాదవ్, భువనగిరి నాయకులు అయోధ్య పాల్గొన్నారు.