30-08-2025 12:00:00 AM
ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్
మహబూబాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 67 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
అలాగే 27 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 7 లక్షల 20వేల 220 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో ఆర్థికంగా చితికిపోయిందని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ, రైతు సంక్షేమానికి, పేద ప్రజల అభ్యున్నతికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ కూడా లోటు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్తున్నట్లు చెప్పారు.