calender_icon.png 4 November, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి

04-11-2025 12:47:00 AM

సోయా, మక్క కొనుగోలు కేంద్రలను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

ఆదిలాబాద్, నవంబర్ ౩ (విజయక్రాంతి): అకాల వర్షాలతో తడిసిన పంట చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే  అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. బోథ్ నియోజకవర్గ ప్రజల ప్రధాన పంటలైన పత్తి, సోయా, మొక్క జొన్న, శనగ, వేరు శనగ పంటలకు బోనస్ ఇవ్వాలన్నారు. సోమవారం నేరడిగొండ, బోథ్, ఇచ్చోడ, తాంసి, భీంపూర్, మండల కేంద్రలలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సోయా బిన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ చైర్మన్ అడ్డీ బోజా రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతుల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. చాలా మంది రైతుల వద్ద సెల్ ఫోన్లు లేవనీ,  ఉన్న నెట్వర్కులు లేవు కావున ఈ ఒకటి రెండు సంవత్సరాలు పాత పద్ధతి ద్వారానే పత్తి కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా రైతులు ఎవరుకూడా దళారులకు పంట అమ్మి మోసపోవద్దు అన్నారు.  ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారు.