30-10-2025 04:32:45 PM
 
							కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పెంచికల్ పేట్ మండలం అగర్ గూడ గ్రామంలో గుడుంబా, నాటుసారా అమ్మకాలు, వినియోగాన్ని పూర్తిగా నివారించడానికి గ్రామ యువకులు ముందుకు వచ్చి ప్రతిజ్ఞ చేశారు. నేటి నుంచి గ్రామంలో గుడుంబా, నాటుసారా అమ్మరాదని తామంతా సహకరిస్తామని శపథం చేశారు. యువకుల చొరవను గ్రామ మహిళలు అభినందించారు. ఎవరైనా గుడుంబా విక్రయించినా చట్ట పరమైన చర్యలు తీసుకునేలా చేస్తామని యువకులు, గ్రామస్థులు హెచ్చరించారు.