calender_icon.png 2 May, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి

22-04-2025 01:14:17 AM

 వైరా,  ఏప్రిల్ 21: వైరా పట్టణం, వైరా రూరల్ ప్రాంతాల్లో వీచిన బలమైన గాలి దుమ్ము, అకాల వర్షంతో వరి ధాన్యం, మొక్కజొన్న, మిర్చి తడిసిపోయి రైతు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారంతో పాటు తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం ఉదయం వైరా వ్యవసాయ మార్కెట్లో తడిసిన వరి ధాన్యాన్ని సిపిఎం నేతలతో కలిసి వారు పరిశీలించారు. రైతులకు ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక రైతులు ఆకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే కోనుగోలు కేంద్రాల్లో రైతులకు ఉపయోగపడే సామాగ్రిని అందుబాటులో ఉంచాలని అధికారులకు కోరారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు కొనుగోలు చేయాలని కోరారు.

 వ్యవసాయ మార్కెట్ లో తడిసిన ధాన్యం పరిశీలనలో ఆయనతోపాటు సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, పట్టణ నాయకులు సంక్రాంతి పురుషోత్తమరావు, కామినేని రవి, షేక్ నాగుల్ పాషా, గుమ్మా నరసింహారావు, నారికొండ అమరేందర్, విప్పలమడక మాజీ సర్పంచ్ తుమ్మల జాన్ పాపయ్య, మేడా శరాబంది, అమరనేని కృష్ణ, వడ్లమూడి మధు తదితరులు పాల్గొన్నారు.