14-08-2025 01:54:07 AM
తెలంగాణ ఎలక్ట్రోపతి ప్రాక్టీషనర్స్ అసోసియేషన్
ముషీరాబాద్, ఆగస్టు 13(విజయక్రాంతి): సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఎలక్ట్రోపతి వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ ఎలక్ట్రోపతి ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎ. కరీం అన్నారు. ఈ మేరకు బుధవారం హైదర్ గూడలోని ఎన్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తం గా హలోపతి, హోమియోపతి, ఆ యుర్వేదిక్, యునాని, తరహాలో ఎలక్ట్రోపతి వైద్యం అందుబాటులో ఉందన్నారు.
ఈ ఎలక్ట్రోపతి వైద్యంతో క్యాన్సర్, గుండె, కిడ్నీ వ్యాధులతో పాటు వివిధ రకాల వ్యాధులకు చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రం లో 5వేల ఎలక్ట్రోపతి క్లినిక్స్ ఉండగా అందు లో 10 వేల మంది వైద్యులు సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఈ ఎలక్ట్రోపతి వైద్యాన్ని ప్రభుత్వం గుర్తించాలని, సుప్రీంకోర్టు 2011 లో కేంద్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేయగా, రాజస్థాన్ ప్రభుత్వం 2018 లో ఎలక్ట్రోపతి వైద్యాన్ని గుర్తించిందని, 80 వేల మంది వైద్యులు రోగులకు చికిత్సలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎలక్ట్రోపతి వైద్యాన్ని ఇంతవరకు గుర్తించక పోవడం బాధాకరమన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎలక్ట్రోపతి క్లినిక్ పై దాడులు చేయ డంతో పాటు అనుమతి లేదని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రోపతి వైద్య సేవలను గుర్తించాలని, లేనిపక్షంలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ లైస్సెన్స్ నుంచి మినహాయిం పు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ లీగల్ సలహాదారు ఎం.ఏ రహీం ఖాన్, కోశాధికారి డాక్టర్ ముక్తార్ అహ్మద్, సభ్యులు డాక్టర్ జుబైర్ పాల్గొన్నారు.