08-08-2025 12:44:45 AM
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
నిజామాబాద్ ఆగస్టు 7 (విజయ క్రాంతి) ః నరాలను పోగులుగా చేసి..తమ రక్తాన్ని రంగులుగా అద్ది..గుండెలను కండెలుగా మార్చి..చెమట చుక్కల్ని చీరలుగా మలచి..పేగులను వస్త్రాలుగా అందించి..మనిషికి నాగరికతను అందించిన.. ఘనత చేనేత కార్మికులది అన్నారు.భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి అహింసా ఉద్యమానికి నాంది పలికింది చేనేత రంగం అన్నారు.
ఆనాడు విదేశీ వస్త్రాల బహిష్కరించాలనే లక్ష్యంతో స్వదేశీ ఉద్యమాన్ని ఉదృతం చేయడంలో కీలక పాత్ర వహించరాని అన్నారు.భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఇందూర్ జఅర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు 1905 ఆగస్టు 7న విదేశీ వస్తువుల బహిష్కరణలో కీలకపాత్ర పోషించిన రోజును జాతీయ చేనేత దినంగా ప్రకటించాలన్న మన తెలంగాణ బిడ్డ రాహుల్ ఆనంద భాస్కర్ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మోదీ నాయకత్వంలో 2015లో అధికారికంగా జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 గా ప్రకటించడం చేనేత రంగానికి దక్కిన గౌరవం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు స్వామి యాదవ్, గిరిబాబు, చేనేత సాకార సంఘం అధ్యక్షులు రామకృష్ణ, సత్యపాల్, ప్రసాద్,విజయలక్ష్మి బిజెపి నాయకులు కిషోర్, నాగరాజు, బొట్టు వెంకటేష్, పల్నాటి కార్తీక్, వేరేందర్, రవి, లక్ష్మణ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.