calender_icon.png 9 October, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో గెలిస్తేనే సర్కార్‌కు చెక్

09-10-2025 12:59:56 AM

  1. మాగంటి సునీత గెలుపునకు కృషి చేయాలి

కార్యకర్తలకు బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు దిశానిర్దేశం

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ ఎస్ గెలిస్తేనే ప్రభుత్వానికి చెక్ పడుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పార్టీ కార్యకర్తలకు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరే కత ఉందని, దానిని సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన పార్టీ కీలక సమావేశంలో వారు మాట్లాడారు.

పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల బాధ్యతలు అప్పగించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, ఇన్‌చార్జిలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తమకు అప్పగించిన డివిజన్లలో పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. బాకీ కార్డుల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, ఉదయం, సాయంత్రం వేళల్లో పాదయాత్రలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

బూత్ కమిటీలు నిరంతరం ఓట ర్లతో సంప్రదింపులు జరపాలని స్పష్టం చేశా రు. ప్రచారం చివరి దశలో రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రచారానికి రావాలని కొందరు నేతలు సమావేశంలో ప్రతిపా దించినట్లు తెలుస్తోంది. సమావేశంలో అభ్యర్థి మాగంటి సునీత, మాగంటి గోపినాథ్ సోదరుడు వజ్రనాథ్ పాల్గొన్నారు.