calender_icon.png 25 November, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బచ్చుగూడెంలో ఘనంగా మల్లన్న జాతర

11-02-2025 12:00:00 AM

పటాన్‌చెరు, ఫిబ్రవరి 10 : పటాన్చెరు మండల పరిధిలోని బచ్చుగూడెం గ్రామం లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర వైభవంగా జరుగుతోంది. సోమవారం జరిగిన కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి  హాజరయ్యారు. మండల, స్థానిక నేతలతో కలిసి మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మల్లన్న దయతో ప్రజలందరూ సుఖఃసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. 

ఈదుల నాగులపల్లిలో..

తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఈదుల నాగులపల్లిలో కామరతి సమేత బీరప్ప స్వామి, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ మహోత్సవానికి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కాట శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు. స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్గౌడ్ను ఉత్సవ నిర్వహాకులు ఘనంగా సన్మానించారు. 

లక్డారంలో... 

పటాన్చెరు మండలం లక్డారం గ్రామం లో మల్లన్న జాతర కన్నుల పండువగా జరుగుతోంది. ఉత్సవాలకు గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ గా హాజరయ్యారు. జాతరకు రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పనగేశ్ హాజరై మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలమ కమిటీ కార్పొరేటర్ను ఘనంగా సత్కరించారు.