21-05-2025 01:05:49 AM
నాగిరెడ్డిపల్లి పరమేశ్వర్ :
* ఈ నెల 23న సీఎం రేవంత్‌రెడ్డి జహీరాబాద్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో నూతన షుగర్ ఫ్యాక్టరీపై ఏదైనా ప్రకటన వస్తుందనే ఆశాభావంతో రైతులు ఎదురుచూస్తున్నారు. రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? లేదా అన్న అంశం ఇప్పుడీ ప్రాంతంలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఎండలకు ఎండిపోతున్న బావు లు, కుంటలు, అడుగంటిపోతున్న భూగర్భజలాలు, ఆశగా ఆకాశం వైపు నాలుగు చినుకులు రాలతాయేమోనని ఎదురుచూసే అమాయక అన్నదా తలున్న ఏడారి లాంటి ప్రాంతాలు జహీరాబాద్, నారాయణఖేడ్. బిందెడు నీళ్ల కో సం చేతిపంపుల దగ్గర గంటలకొద్దీ బారు లు తీరే అక్కా చెల్లెళ్ల క‘న్నీటి’గాథలకు ఆనవాళ్లు.
నేలతల్లినే నమ్ముకొని, వాన చిను కుల మీద ఆధారపడి.. నాలుగు తిండి గిం జలు పండించే ఇక్కడి చిన్న, సన్నకారు రైతుల సాగునీటి వెతలు అన్నీ ఇన్నీ కావు. సంగారెడ్డి జిల్లాలో మంజీరా నదితోపాటు చిన్న చిన్న చెరువులు, కుంటలు మినహా.. పెద్దగా నీటి వనరులు కనిపించవు. నారిం జ వంటి చిన్న ప్రాజెక్టు ఉన్నప్పటికీ.. ఎగు వ నుంచి జలాలు రాకపోవడంతో ప్రతి ఐదేళ్లలో మూడేళ్లు నీటి లభ్యత కరువైంది.
దీంతో రైతులు తమ ఎర్ర, నల్ల రేగడి కమతాల్లో చిరుధాన్యాలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాష్ర్టంలో అత్యధికంగా చె రుకు పండించే ప్రాంతంగా జహీరాబాద్ కు పేరు ఉంది. రైతులు వానకాలంలో ప చ్చజొన్న, పెసర్లు, మినుము, అంతర పం టగా కంది, పెసర, ఉలవలు, కొర్రలు, సా మలతో పాటు పలు పంటలు సాగు చేస్తా రు. నీటి వసతి లేక ఏడాదిలో ఒక పంట పండటమే గగనమైంది. వాణిజ్య పంటలైన చెరుకు, అల్లం సాగు చేసే రైతన్న సా గు నీటి కోసం చేయని ప్రయత్నం లేదు.
‘బసవేశ్వర’ ద్వారా 1.65 లక్షల ఎకరాలు..
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత అన్నదాతల్లో ఆశలు చిగురించా యి. ప్రాజెక్ట్‌లో భాగంగా కొండపోచమ్మ నుంచి గోదావరి జలాలను సింగూరు రిజర్వాయర్‌కు జలాలను తరలించి, తద్వారా నీటి లభ్యతను పెంచి, తద్వారా పూర్తిగా వెనకబడిన నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా బసవేశ్వర, సంగమేశ్వ ర ఎత్తిపోతల పథకాలు ఉండాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేశారు.
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు, మంజీరా పరీవాహక ప్రాంతంలోని 20కి పైగా మండలాల పరిధిలోని 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు బసవేశ్వ ర ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తడవుగా సర్వే కూడా పూర్తి చేశారు. 8 టీఎంసీల సామర్థ్యంతో ఎత్తిపోతల పనులను ప్రారంభించారు. సంగమే శ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులకు రూ.4,427 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
‘సంగమేశ్వర’ ద్వారా 2.19 లక్షల ఎకరాలు..
సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్, జరా సంగం, జహీరాబాద్, న్యాల్‌కల్, మొగుడంపల్లితోపాటు సంగారెడ్డి నియోజకవ ర్గంలోని సదాశివపేట, కొండాపూర్, కంది మండలాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 12 టీఎంసీల సామర్థ్యంతో గత ప్రభుత్వం ప్రాజెక్టు పను ల శ్రీకారం చుట్టింది. 2022 ఫిబ్రవరిలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన సైతం చేశారు. పనులను ‘మెగా’ ఇంజినీరింగ్ కంపెనీ దక్కించుకున్నది.
ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం కొండపోచ మ్మ ప్రాజెక్టు నుంచి సింగూరులోకి నీటిని మళ్లించి ఎత్తిపోతల ద్వారా సాగునీటిని అందించాల్సి ఉంది. కంపెనీ ఈ మేరకు మనూరు మండలం బోరంచ వద్ద పంపుహౌస్ పనులు ప్రారంభించింది. పంపు హౌస్ కోసం కొంత భూమిని సేకరించి, లెవలింగ్ పనులు పూర్తి చేసింది. ఈలోపు రైతులు భూసేకరణ, పరిహారం విషయంలో రైతులు కోర్టుకు వెళ్లారు. దీంతో ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి.
ప్రకటనలు మస్తు.. పనులకు స్వస్తి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం రెండు ఎత్తిపోతల పనులను పట్టించుకోవడం లేదనే వి మర్శలు ఉన్నాయి. ఒక దశలో రెండు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉందనే ప్రచారమూ సాగింది. దీనిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల స్పందిస్తూ.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా రెండు ఎత్తిపోతల ప్రా జెక్టుల్లో మార్పులు చేస్తున్నామని, ప్రతిపాదిత ప్రాజెక్టులను రద్దు చేయలేదని తేల్చి చెప్పారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల పథకాలపై గత నవంబర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తూ.. ‘సింగూరు, మంజీరాకు గోదావరి జలాలు తరలిరానున్నాయి. తద్వారా హైదరాబాద్ మహానగరానికి మంచినీటితో పాటు రైతులు దర్జాగా సేద్యం చేసుకునేందుకు వీ లుగా సాగుజలాలు రానున్నాయి. సర్కార్ సింగూర్ ప్రాజెక్ట్‌లో పూడికతీత పనులు ప్రారంభించనున్నది.
కాలువల లైనింగ్‌కు టెండర్ల ప్రక్రియ మొదలు పెడతాం’ అని ప్రకటించారు. కానీ, ఆ తర్వాత కనీసం ఎత్తిపోతల పథకాల ఊసైనా సర్కార్ ఎత్తలేదు. ఎత్తిపోతల పనులకు నాటి ప్రభుత్వ పెద్ద లు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు ఇప్పుడు దీనంగా చూస్తున్నాయి. కరువు కరాళ నృత్యం చేసే జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంత నేల ఇంకెన్నాళ్లు కన్నీటితో తడవాలి? గోదారమ్మ ఈ నేలను తడుపుతుంటే.. భూమి నుంచి బువ్వ తీయాలన్న రైతు కోరిక ఇకనైనా నెరవేరదా?
‘బీఆర్‌ఎస్ సర్కారు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణనానికి వేలాది కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసింది. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు చేపట్టింది. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు మేలు చేసే విధంగానే పనులు జరిగాయి’ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు గత ప్రభుత్వం లాగానే నడచుకుంటున్నారు. నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం(ఎన్‌కేఎల్‌ఐఎస్) అంచనాలను అమాంతం పెంచేశా రు.
ఉమ్మడి పాలనలో నాటి పాలకులు ప్రాజెక్టు నిర్మాణానికి అనేక సర్వేలు చేసిం ది. నాటి డీపీఆర్ ప్రకారం ఈ పథకానిక య్యే వ్యయం రూ.3,117 కోట్లు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టు కోసం రూ.4,350 కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా వేసింది. వేల కోట్ల నిధుల పెంపు ను ఏ విధంగా అర్థంచేసుకోవాలి. రాష్ట్ర బడ్జెట్‌లో ఇరిగేషన్‌శాఖకు కేటాయింపుల్లోనూ ఉమ్మడి మెదక్ జిల్లాపై వివక్ష కని పించింది.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట-- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీని వాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహించే ఉమ్మడి ఖమ్మం జిల్లాకే బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు మాత్రం చిల్లిగవ్వ విదిల్చలేదు.
ఈసారైనా తీపికబురందేనా?
జహీరాబాద్ చెరుకు సాగుకు ప్రసిద్ధి. కానీ, ఇక్కడి రైతన్నకు మాత్రం ఎప్పుడూ ‘చేదు’ అనుభవాలే ఎదురవుతున్నాయి. కారణాలేవైనా.. ఇక్కడి ట్రైడెంట్ షుగర్స్ ఫ్యాక్టరీ మూతపడటం అన్నదాతలకు బిగ్ షాక్. ఈ నెల 23న సీఎం రేవంత్‌రెడ్డి జహీరాబాద్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో నూతన షుగర్ ఫ్యాక్టరీపై ఏదైనా ప్రకటన వస్తుందనే ఆశాభావంతో రైతులు ఎదురుచూస్తున్నారు.
వంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? లేదా అన్న అంశం ఇప్పుడీ ప్రాంతంలో హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి రెండు ఎత్తిపోతల పనులు పూర్తి చేసేందుకు సంకల్పిస్తారని, జహీరాబాద్ వేదికపై నుంచే స్పష్టమైన హామీ ఇస్తారని రైతులు ఆశిస్తున్నారు.
వ్యాసకర్త సెల్‌నంబర్
90106 01375