calender_icon.png 2 January, 2026 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీం విగ్రహం ఏర్పాటు అభినందనీయం

02-01-2026 12:17:56 AM

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

బెజ్జూర్, జనవరి 1 (విజయక్రాంతి): బెజ్జూ ర్ మండలంలోని అందుగుల గూడ గ్రామ సమీపంలోని ప్రధాన చౌరస్తాలో ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీం విగ్రహం ఏర్పాటు కోసం సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గురువారం భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికి, పూలమాలలు వేసి, శాలువాతో మాజీ ఎమ్మెల్యేను సత్కరించారు.

ఈ సందర్భంగా కోనప్ప మాట్లాడుతూ కుమ్రం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇది ఆదివాసీ సమాజానికి గర్వకారణమని తెలిపారు. అనంతరం సలుగుపల్లి గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.