calender_icon.png 2 January, 2026 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసరకు కేంద్రీయ విశ్వవిద్యాలయం కావాలి

02-01-2026 12:19:11 AM

భైంసా, జనవరి ౧ (విజయక్రాంతి): చదువులకు కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి బాసర లో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరుతూ గురువారం ముధోల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాయల శంకర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విన్నవించారు. హైదరాబాదులో కిషన్ రెడ్డి నివాసంలో మంత్రి కలిసిన ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాసరలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని వారు మంత్రికి విన్నవించారు.