calender_icon.png 17 January, 2026 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యంత వైభవంగా గోదా సమేత శ్రీరంగనాథస్వామి కల్యాణ మహోత్సవం

17-01-2026 02:35:35 AM

పట్టువస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

ఘట్ కేసర్, జనవరి 16 (విజయక్రాంతి): జిహె ఘట్ కేసర్ సర్కిల్ పరిధి 7వ డివిజన్ ఎదులాబాదులోని గోదా సమేత శ్రీరంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలో జరిగిన శ్రీరంగనాథస్వామి కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా కుటుంబ సభ్యులు సతీమణి కల్పన రెడ్డి, కుమారుడు చామకూర భద్ర రెడ్డి, కోడలు ప్రీతిరెడ్డిలతో కలిసి పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణాల మధ్య స్వామి వారి కళ్యాణం వైభవోపేతంగా జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ పురాతన దేవాలయంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఏటా పాల్గొనడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అశ్వర్యాలతో వర్ధిల్లాలని అలాగే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆ రంగనాథస్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. కళ్యాణ మహోత్స వానికి భక్తజనులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిలాడింది. పాల్గొన్న భక్తులకు తీర్థప్ర పాదాలను అందజేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో మాజీ సర్పంచ్ బట్టె శంకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ననావత్ రెడ్యానాయక్, మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి, రైతు సొసైటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ మంకం రవి, నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపాల సుధాకర్ రెడ్డి, బద్దం జగన్మోహన్ రెడ్డి, బట్టె లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.