calender_icon.png 14 January, 2026 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి

15-01-2026 12:00:00 AM

  1. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
  2. లేదంటే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం
  3. ఇచ్చిన మాటను విస్మరిస్తే రాజకీయంగా బొంద పెడతాం
  4. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్, జనవరి 13(విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. మంగళవారం కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని అంకిరెడ్డి గార్డెన్స్‌లో బీసీల ఆత్మీయ సమ్మేళనం జిల్లా అధ్యక్షుడు అకినీడు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో   జాజుల శ్రీని వాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు.

రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీ సమాజం అడ్డుకొని తీరుతుందన్నా రు. ఈనెల 28నుంచి ఢిల్లీలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పార్లమెంట్‌లో చట్టం చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా కేంద్రం అడుగడుగునా అడ్డుకుంటుందని అన్నారు.

50 శాతం రిజర్వేషన్ల పరిమితి పేరుతో బీసీలను రాజకీయంగా అణచివేస్తుందని జాజుల ఆరోపించారు.  సం క్రాంతి తర్వాత బీసీ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేసి బీసీ రిజర్వేషన్లు 42 శాతం సాధించేవరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయం పై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

సమావేశంలో గ్రంథాలయ పరిషత్ జిల్లా  చైర్మన్ పి వీరబాబు, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మడత వెంకట్ గౌడ్, జాతీయ సలహాదారు మిట్టపల్లి సాంబయ్య, జనరల్ సెక్రెటరీ సమ్మయ్య, రాష్ట్ర కార్యదర్శి సోమేశ్వర్ గౌడ్, కార్యనిర్వాక అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మీనాక్షి, జిల్లా ఉపాధ్యక్షులు మాద శ్రీరాములు, బీసీ ఐక్యవేదిక నా యకులు రంగారావు,భిక్షపతి, వేముల నరేష్, వేణు మహేష్ గౌడ్, పల్లపు లక్ష్మ ణ్, తదితరులు పాల్గొన్నారు.