23-12-2025 12:00:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాం తి) : సీఎం ఆదేశాల మేరకు సంక్రాంతి పండు గ వాతావరణానికి తగిన విధంగా హైదరాబాద్ నగరం సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా కైట్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహిం చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 13వ తేదీ నుంచి 15 వరకు నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై సోమవారం సచివాలయం లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. కైట్ ఫెస్టివల్‌కు ప్రత్యేక గుర్తింపు, విస్తృత ప్రచారం కల్పించేలా సరైన పేరు, ప్రత్యేక బ్రాండింగ్, ఆకర్షణీయమైన లోగోను రూపొందించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. హైడ్రా ద్వారా పునరుద్ధరించిన చెరువుల వద్ద ఈ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించాలని సీఎం ఆకాంక్షను సీఎస్ తెలిపారు. కైట్ ఫెస్టివల్ ఏర్పాట్ల ను పర్యవేక్షించి సమన్వయం చేయడానికి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైడ్రా తరఫున ఒక్కొక్క ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు.
సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగరవ్యాప్తంగా హైడ్రా పునరుద్ధరించిన చెరువులపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీ క్రాంతి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు కార్యక్రమాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నామన్నారు. ఈ వేడుకల్లో దేశీరౌ గాలిపటాల కళాకారులు పాల్గొంటారని చెప్పారు.
అదేవిధంగా నగర పరిసర ప్రాంతాల్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను, డ్రోన్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, మనుచౌదరి, టీజీ ఎస్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్, సమాచారశాఖ అదనపు సంచాలకులు డీఎస్ జగన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.