calender_icon.png 23 December, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో పనిచేద్దాం

23-12-2025 12:00:00 AM

గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..

గ్రామస్తులందరూ మనవారే.. పార్టీలకతీతంగా పనిచేయండి

ప్రతి సర్పంచ్ పెద్ద జీతగాడిలా పనిచేయాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీంలో సర్పంచులు మీరు

సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే 

వనపర్తి, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేసి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి  పేర్కొన్నారు. సోమవారం కొత్తగా కొలువుతీరిన గ్రామ పాలకవర్గం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ  గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయని గెలిచిన ఓడిన గ్రామంలో అందరు సమానమేనని పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధికి కొత్త పాలకవర్గం కృషి చేయాలని ఆయన అన్నారు.

ప్రతి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులందరూ గ్రామాభివృద్ధి కోసం పెద్ద జీతగాడిలా పనిచేసే అభివృద్ధి సాధించాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి  టీంలో విజయం సాధించిన తొలి సర్పంచ్లు మీరని ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. నెల రోజుల్లో గ్రామాలలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి గ్రామాలను అద్దంలో తీర్చిదిద్దాలని సర్పంచ్లకు ఎమ్మెల్యే సూచించారు. గ్రామాలకు కావలసిన నిధులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తుందన్నారు.

పెద్ద ఎత్తున అవసరమయ్యే పనులకు ఎమ్మెల్యే నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధుల నుంచి నిధులు రాబట్టి అభివృద్ధి చేసుకుందామని సర్పంచులు గ్రామాలలో మౌలిక వసతుల కల్పన పై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని ఆయన సూచించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘణపురం మండలం లోని రోడ్డుమీద తండా, ఘణపురం, సోలిపురం, పెద్దమందడి మండలంలోని వీరాయపల్లి, పామిరెడ్డిపల్లి, చిన్న మందడి,పెద్దమందడి, పెబ్బేరు మండలంలోని తోమాలపల్లి, వై శాఖాపురం, కంచిరావుపల్లి, గ్రామాలలో నిర్వహించిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.