26-12-2025 12:00:00 AM
ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, డిసెంబర్ 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా ఎల్లయ్య చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డులో ఉన్న ఎల్లయ్య చెరువు పునరుద్ధరణ పనులను రూ.3.14 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ చెరువు జీవం కోల్పోయిన నేపథ్యంలో దాని అభివృద్ధి, ఆధునికీకరణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని చెప్పారు.పట్టణ ప్రజలకు విహార వేదికగా మారేలా ట్యాంక్బండ్ తరహాలో ఎల్లయ్య చెరువును అభివృద్ధి చేస్తున్నామని, కల్కి చెరువు మాదిరిగా సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పనుల ద్వారా పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, ఎజాస్, నార్ల సురేష్, వెంకన్న గుప్తా, మోహన్ నాయక్, పట్టణ ప్రజలకు విహార వేదికగా మారేలా ట్యాంక్బండ్ తరహాలో ఎల్లయ్య చెరువును అభివృద్ధి చేస్తున్నామని, కల్కి చెరువు మాదిరిగా సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పనుల ద్వారా పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, ఎజాస్, నార్ల సురేష్, రవీందర్ ,వెంకన్న గుప్తా, మోహన్ నాయక్, మహమ్మద్ గౌస్,ఎండీ దావూద్, వాహబ్, అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు.