04-05-2025 12:00:00 AM
హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి లైబ్రరీకి వెళ్లే అలవాటుంది? అయితే ఈ సమ్మర్‌లో మనం లైబ్రరీకి వెళ్లడం కాదు.. మన దగ్గరికే వస్తే ఎంత బాగుంటుంది. ’పుస్తకం అంటే ఇంట్లో దాచుకునే వస్తువు కాదు.. పదిమందికిచ్చి చదివించేది‘. అనే ఆలోచన ఇద్దరు చిన్నారులకు కలిగింది. వారి పేర్లు టోడ్ బోల్, రిక్ బ్రూక్స్. కొత్తతరం ఇష్టపడే గ్రంథాలయాలను ర్పాటు చేశారు. ’ద లిటిల్ ఫ్రీ లైబ్రరీ‘ ఇంటి గేటు ముందు ఉత్తరాల డబ్బా అంతటి సైజున్న లిటిల్ లైబ్రరీ.. ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించింది.
అమెరికాలోని అన్ని రాష్ట్రాలతో పాటు సుమారు 121 దేశాలకు పాకింది. లిటిల్ ఉద్యమం. 1.75 లక్షల లైబ్రరీల మైలురాయి దాటింది. ఇప్పటి వరకు 40 కోట్ల పుస్తకాలు చేతులుమారాయి. పేరులోనే ఉంది లిటిల్ లైబ్రరీ అని.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో లైబ్రరీకి వెళ్లాలంటే అదొక కార్యక్రమం. ప్రత్యేక పనిగా పెట్టుకుంటే తప్ప వేళ్లలేని పరిస్థితి. ఇప్పుడున్నవన్నీ ఒకప్పుడు వచ్చిన గ్రంథాలయాలే.
కాబట్టి నగరాలు, పట్టణాల్లో రద్దీ కూడళ్లలోనే వెలిశాయని.. ట్రాఫిక్ ను ఛేదించుకుని వెళ్లడం అంత సులభం కాదు. అందులోనూ లైబ్రరీల నిర్వహణ అధ్వానంగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక్కపూట లైబ్రరీకి వెళ్లొస్తే.. మరుసటి రోజు అలర్జీ తప్పడం లేదు. అందులోనూ కొత్తతరం ఇష్టపడే వర్ధమాన పుస్తకాలను ప్రభుత్వ లైబ్రరీలు అంత త్వరగా తెప్పించవు.
ఇద్దరు చిన్నారులు ప్రారంభించిన గ్రంథాలయోద్యమం విప్లవంలా జనంలోకి వెళ్లింది. పుస్తకం పఠనం పెంచింది. ఇలాంటి పుస్తకోద్యమాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు పాఠకులు పెరిగారు. ఈ ఆధునిక కాలంలో ప్రాధాన్యతలు మారడంతో అన్ని దేశాల్లో లైబ్రరీలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కొత్తతరం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ పరిణామాలన్నీ గమనించిన టోడ్ బోల్, రిక్ బ్రూక్స్ లు సరికొత్త ఆలోచనలతో లిటిల్ లైబ్రరీలకు శ్రీకారం చుట్టారు.
టోడ్ తండ్రి డాక్టర్. తల్లి టీచర్. తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివేదామె. కొడుక్కు అదే అబ్బింది. సాహిత్య, సామాజిక, తత్వశాస్త్రాలను చదువుకున్న టోడ్.. యూఎస్ లోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ, సైకాలజీ లలో పట్టభద్రుడయ్యాడు. పుస్తకాల పిచ్చి కదా.. అందుకే బోధనారంగం ఆకర్షించింది. కొన్నాళ్లు టీచరై పాఠాలు చెప్పాడు. ’ఇతర దేశాల్లోనే కాదు.. అమెరికాలో కూడా మూడు కోట్లమంది నిరక్ష్యరాస్యులు ఉన్నారు.
చదువరుల్లో కూడా పుస్తకాలు చదవడం తగ్గింది. ఏదో రకంగా తిరిగి చదివించే అలవాటును బతికించాలన్న తపన వెంటాడేది. ఏ జాతి అయినా సాంస్కృతిక వికాసంతోనే ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మిస్తుంది. తద్వార మానవీయ, నైతిక, సాంస్కతి*క విలువలు పెంపొందుతాయి. అందుకు పుస్తకపఠనమే అత్యుత్తమ ఆదర్శ మార్గం‘ అన్నది టోడ్ నమ్మిన సిద్ధాంతం.
అలా పుట్టింది ఆలోచన..
విస్కాన్సిన్ (యూఎన్)లోని హడ్సన్.. ఒక చిన్న గది. అచ్చం క్లాస్ రూం లాగే ఉంది. అందులో కొన్ని ఎంపిక చేసిన పుస్తకాలు. రాక్ లలో పద్ధతిగా అమర్చారు. వయోబేధం లేకుండా వస్తున్నారు పాఠకులు. ’హాయ్ టోడ్.. నీదొక అద్భుతమైన ఆలోచన దీన్ని అమెరికా వరకే పరిమితం చేయొద్దు.. ప్రపంచమంతా తీసుకెళ్లు‘ అంటూ ఒక పెద్దాయన టోడ్ భుజం తట్టి అభినందించాడు.
’గుడ్ ఐడియా అంకుల్‘ అంది మరోర విద్యార్థిని. వారం గడిచింది.. ఇరుగుపొరుగు వారొచ్చారంతా.. కొందరు ఇక్కడి పుస్తకాలను ఉచితంగా తీసుకెళుతుంటే.. మరికొందరు తమ ఇళ్లలోని పుస్తకాలను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. వచ్చిపోయేవాళ్లందరూ రిజిస్టర్ నోట్ బుక్ లో పేర్లు నమోదు చేశాక తెలిసింది. డిమాండ్ ఎంత పెరిగిందోరో.. టోడ్ పెట్టి లిటిల్ లైబ్రరీకి అంత పేరొస్తుందని అస్సలు ఊహించలేదు.
పాఠకులు లైబ్రరీలకు వెళ్లడం కాదు.. లైబ్రరీలే వాళ్ల వద్దకు వెళ్లాలి. అనే ఉద్దేశంతో ’ద లిటిల్ ఫ్రీ లైబ్రరీ‘ కి అంకురార్పణ జరిగింది. ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ ఓ చిన్న చెక్కపెట్టెను మనిషి ఎత్తులో అమర్చితే చాలు.. అదే లిటిల్ లైబ్రరీ. నిర్వహణకు సిబ్బంది అక్కర్లేదు. భవనాలు అసలే అవసరం లేదు. పుస్తకాలను ఎవరైనా ఇవ్వొచ్చు.. ఎవరైనా తీసుకెళ్లొచ్చు.. ఇదీ లిటిల్ లైబ్రరీ కాన్సెఫ్ట్.