26-10-2024 12:00:00 AM
పీకేఎల్ 11వ సీజన్
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11లో తొలిసారి ఒక మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. శుక్రవారం గచ్చిబౌలి వేదికగా పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో చివరకు విజయం పట్నానే వరించింది. మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 42-20తో తమిళ్ తలైవాస్ జట్టుపై విజయం సాధించింది.
పట్నాకు ఈ సీజన్‌లో ఇదే తొలి విజయం కాగా.. వరుసగా రెండు విజయాల తర్వాత తమిళ్ తలైవాస్ ఓటమిని మూటగట్టుకుంది. పట్నా తరఫున దేవాంక్ 25 రెయిడ్ పాయింట్లు సాధించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. తమిళ్ తలైవాస్ ఆటగాడు నరేందర్ 15 రెయిడ్ పాయింట్లతో సత్తా చాటాడు.
ఆఖరి వరకు ఇరుజట్ల రైడర్లు అద్భుత పోరాటం కనబరచడంతో ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కబడ్డీలో ఉండే మజాను సీజన్‌లో అభిమానులకు ఈ మ్యాచ్ తొలిసారి రుచి చూపించింది.
మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పునేరి పల్టన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. పునేరి జట్టు 36-22 తేడాతో బెంగళూరు బుల్స్‌ను మట్టికరిపించింది. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో డిల్లీ దబాంగ్, యు ముంబాతో బెంగాల్ తలపడనున్నాయి.