calender_icon.png 22 November, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లవ్‌స్టోరీ రివీల్ అప్పుడే..

22-11-2025 01:08:02 AM

అతితక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అయిన హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. సంప్రదాయం, గ్లామర్.. లుక్ ఏదైనా కట్టి పడేసే అందచందాల ఈ ముద్దుగుమ్మ హిందీ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అభిమానుల సంఖ్య పెంచుకుంటూపోతోంది. అలా తన ఖాతాలో పలు హిట్ సినిమాలు వేసుకుంటూ కొత్త ప్రాజెక్టులనూ ప్రకటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్‌లో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం తెలుగులో ‘డకాయిట్’ చిత్రంలో నటిస్తున్న మృణాల్ హిందీలోనూ ఓ సినిమా చేస్తోంది.

ఇదేకాకుండా తాను భాగమైన మరో బాలీవుడ్ ప్రాజెక్టు గురించి తాజాగా ప్రకటించిందీ భామ. దీన్ని బాలీవుడ్‌కు చెందిన నిర్మాణ సంస్థలు జీ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ స్థాయిలో నిర్మిస్తుండటం విశేషం. ‘దో దివానే షెహర్ మే’ అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది కథానాయకుడు. దీన్ని దర్శకుడు రవి ఉద్యవార్ ప్రేమకథగా తెరకెక్కిస్తుండగా సంజయ్ లీలా భన్సాలీ, ప్రేరణ సింగ్, ఉమేశ్‌కుమార్ బన్సాల్, భరత్‌కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొం టున్న ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా 2026, ఫిబ్రవరి 20న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. మృణాల్ ఈ విషయాన్ని ఓ ప్రత్యేక వీడియో ద్వారా ప్రకటించింది. దీనికి ‘వాలెంటైన్స్ డే సందర్భంగా మా లవ్‌స్టోరీ రివీల్ కానుంది’ అన్న వ్యాఖ్య జోడించింది. ఇది చూసిన నెటిజన్లు సూపర్ జోడీ అనీ, కెమిస్ట్రీ బిగ్‌స్క్రీన్‌పై చూసేందుకు వేచిఉండలేకపోతున్నామనీ కామెంట్స్ చేస్తున్నారు.