22-11-2025 01:07:04 AM
డ్రాగన్, జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, పరదా, కిష్కంధపురి, ది పెట్ డిటెక్టివ్, బైసన్ వంటి చిత్రాలతో ఈ ఏడాదంతా ప్రేక్షకులను పలకరిస్తూ వచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఆయా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి సినీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మరో చిత్రం ‘లాక్‌డౌన్’ గత ఏడాది విడుదల కావాల్సి ఉంది. సర్వైవల్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా గత సంవత్సరం జూన్‌లో విడుదల కావాల్సి ఉంది.
కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ట్టు మేకర్స్ ప్రకటిం చారు. తాజా ప్రకటన ప్రకారం.. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో అడు గుపెట్టనుంది. ఇందులో అనుపమతోపాటు చార్లీ, నిర్మల, ప్రియా వెంకట్, ఇందుమంతి, రాజ్‌కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఐసొలేషన్ ఐడియాతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎమోషన్స్, సస్పెన్స్ వంటి అంశాలతో థ్రిల్ చేయనున్నట్టు గతంలో విడుదలైన టీజర్ ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుబాస్కరన్ నిర్మిస్తుండగా, ఫీచర్ డైరెక్టోరియల్ డెబ్యూట్ ఏఆర్ జీవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ఏకబిగిన ఆరు సినిమాలతో అలరిం చిన అనుపమ నటించిన ఏడో చిత్రం కూడా విడుదలవుతుంటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.