19-09-2025 12:17:21 AM
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల, సెప్టెంబర్ 18 ( విజయక్రాంతి ) : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మౌళిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం గద్వాల పట్టణ శివారు లో నిర్మించి ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇటీవల మంత్రుల చేతుల మీ దుగా పంపిణి చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లనుస్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూతమకు కేటాయించిన ఇంటిల్లో లబ్ధిదారుల కుటుంబ సమేతంగా అందరూ ఇక్కడే నివసించారని ఇప్పటికే కరెంటు, తాగునీరు డ్రైనేజీ వంటి వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చామని మిగతా మౌలిక వసతులను కూడా త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా అక్కడ పనులు చేస్తున్న డ్రైనేజీ, రోడ్లు, బిల్డింగు కు కలర్స్ వంటి పనులు చేస్తున్న అధికారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తిచేసి చే యాలని ఆదేశించారు.
త్వరలోనే డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ప్రతి ఒక్క తమరు కేటాయించిన ఇండ్లలో నివసించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ రామన్ గౌడు, మాజీ ఎంపీపీ విజయ్, జిల్లా సీనియర్ నాయకులు వేణుగోపాల, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.