19-09-2025 12:15:49 AM
జహీరాబాద్, సెప్టెంబరు 18 :జహీరాబాద్ ప్రాంతంలోని ప్రజలు దసరా పండు గకు అప్రమత్తంగా ఉండాలని జహీరాబాద్ పట్టణ ఎస్.ఐ వినయ్ కుమార్ తెలిపారు. జహీరాబాద్ పట్టణంలో ప్రజలను అప్రమ త్తం చేసేందుకు ఆటో ద్వారా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. జహీరాబాద్ డీఎ స్పీ సైదా నాయక్, సిఐ శివలింగం ప్రచార ఆటోను ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ ఆదేశా ల ప్రకారం దసరా పండుగలకు సొంత ఊ రికి వెళ్లేవాళ్లు జహీరాబాద్ లోని తమ ఇళ్ళను జాగ్రత్తగా తాళాలు వేసుకోవాలని, అవసరమైతే సీసీ కెమెరాలు అమర్చుకోవాలని తెలిపారు. తమ ఊర్లోకి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇంటి తాళాలను పూలబుట్టిలలో సజ్జలపైన ఉంచకూడదని, అవసరమైతే సెంట్రల్ లాక్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని వారు తెలిపారు. తమ విలువైన వస్తువులను కాపాడుకునేందుకు పోలీసులకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.