12-12-2025 01:18:36 AM
ఫ్యాన్స్‌తో సిరాజ్ మీట్ అండ్ గ్రీట్
హైదరాబాద్, డిసెంబర్ 11(విజయక్రాంతి): భారత జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగిన మహ్మద్ సిరాజ్‌కు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతోనూ, ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీతోనూ ఎమోషనల్ రిలేషన్ షిప్ ఉంది. సిరాజ్ అద్భుతమైన బౌలర్‌గా ఎదగడానికి ఐపీఎల్‌తో పాటు కోహ్లీ, ఆర్సీబీ ప్రోత్సాహం ఎంత కీలకమయ్యాయో అందరికీ తెలుసు. అందుకే ఆ ఫ్రాంచైజీతోనూ, విరాట్ కోహ్లీతోనూ సిరాజ్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
గత సీజన్‌కు ముందు ఆర్సీబీ నుంచి గుజరాత్ టైటాన్స్‌కు మారిన సిరాజ్‌ను అభిమానులు బెంగళూరు ఆటగాడిగానే చూస్తున్నారు. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ ఉత్పత్తుల సంస్థ స్కెచర్స్ నిర్వహించిన కార్యక్రమంలో సిరాజ్ సందడి చేశాడు. ఇటీవలే ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సిరాజ్‌తో స్కెచర్స్ కొండాపూర్‌లోని శరత్‌సిటీ మాల్‌లో ఫ్యాన్స్‌తో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించింది.
సిరాజ్ మాట్లాడుతుండగా అభిమానులంతా కోహ్లీ.. కోహ్లీ... ఆర్సీబీ..ఆర్సీబీ అంటూ నినాదాలు చేశారు. దీంతో సిరాజ్ కూడా నవ్వుతూ ఎమోషనల్ అయ్యాడు. అభిమానులందరికీ థ్యాంక్స్ చెబుతూ ఆర్సీబీతో తన ఐపీఎల్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు.